వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీనీవా కాలువకు విడుదలైన కృష్ణా జలాలు సోమవారం రాగులపాడు పంపింగ్ కేంద్రానికి చేరుకున్నాయి. జిల్లా సరిహద్దులో 2,500 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, ఆరు మోటార్లతో 1,700 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.
నీరు జీడిపల్లి జలాశయం వైపు వెళ్తోంది. ప్రధానంగా తాగునీటి వనరులను నింపనున్నారు. జీడిపల్లి నిండితే పీఏబీఆర్, గొల్లపల్లి జలాశయాలకు నీరు అందిస్తామని ఈఈ శ్రీనివాసనాయక్ తెలిపారు.
Comments
Loading comments...

