Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో దొంగల హల్‌చల్.. గ్యాస్‌ కట్టర్లతో రెండు ఏటీఎంలు లూటీ

Follow Udayam on Google
sanjay Sep 20, 2026 4:21 PM జాతీయంGeneral
కరీంనగర్‌ రూరల్‌ పరిధిలోని దుర్శేడ్, ఎల్‌ఎండీ పరిధిలోని తిమ్మాపూర్‌లో ఎస్‌బీఐ ఏటీఎంలను దుండగులు గ్యాస్‌ కట్టర్లతో ధ్వంసం చేసి నగదు అపహరించారు. దుర్శేడ్‌ ఏటీఎంలో రూ.8 లక్షలు చోరీ అయినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలపై ద్రవం చల్లి, మాస్కులు, గ్లోవ్స్‌తో చోరీకి పాల్పడ్డారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌ వాహనంలో వచ్చినట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...