Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌ జిల్లాలో ఒకేరోజు రెండు ఏటీఎంల్లో చోరీ

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 9:08 AM కరీంనగర్General
కరీంనగర్‌ జిల్లాలో ఒకేరోజు రెండు ఏటీఎంల్లో చోరీ - Udayam
కరీంనగర్‌ జిల్లాలో దుండగులు ఒకేరోజు రెండు ఏటీఎంలను గ్యాస్‌ కట్టర్‌తో ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు. దుర్శేడు, తిమ్మాపూర్‌లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. దుర్శేడులో సీసీ కెమెరాలపై స్ప్రే చల్లి ఇద్దరు దుండగులు చోరీకి పాల్పడ్డారు. వారిలో ఓ మహిళ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తలకు టోపీ, కళ్లద్దాలు, ముసుగు ధరించి నిందితులు చోరీ చేశారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

Comments

G
Loading comments...