వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్‌రెడ్డి సభకు 400 బస్సులను తరలించడంతో కరీంనగర్ బస్టాండ్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పలు రూట్లలో సరిపడా సర్వీసులు లేక బస్సుల కోసం గంటల తరబడి వేచి చూశారు.
జేబీఎస్, సిద్దిపేట, గోదావరిఖని, జగిత్యాల, నిజామాబాద్ తదితర రూట్లలో బస్సుల కొరత కనిపించింది. దీంతో కొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించగా.. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక ఛార్జీలు వసూలు చేశారు.
Comments
Loading comments...

