Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 11:15 AM పెద్దపల్లి General
క్రీడల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు - Udayam
గోదావరిఖని జవహర్‌ స్టేడియంలో జరిగిన ఎస్‌జీఎఫ్‌ఐ జోనల్‌ స్థాయి పోటీల్లో రామగుండం మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, షాట్‌పుట్‌ విభాగాల్లో 21 మంది జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థులను ప్రిన్సిపల్‌ నీరజ, పీఈటీలు హకీమ్‌, రాంప్రసాద్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

Comments

G
Loading comments...