వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం దీర్ఘాసిలో కరెంట్ షాక్ తో మేండ హేమసుందర్ (24) అక్కడికక్కడే మృతి చెందాడు. దివీస్ ల్యాబ్ లో ఉద్యోగం చేస్తున్న అతడు సెలవుపై ఇంటికి వచ్చాడు.
ఆదివారం సాయంత్రం పొలం చూసేందుకు వెళ్లగా, తెగిపడిన విద్యుత్ తీగ తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. చేతికి అందిన కుమారుడు విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. SI రంజిత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

