Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరాటే పోటీల్లో 'ఉండి' విద్యార్థుల సత్తా

Follow Udayam on Google
M. Dorababu Sep 24, 2026 2:49 PM పశ్చిమగోదావరిGeneral
కరాటే పోటీల్లో 'ఉండి' విద్యార్థుల సత్తా - Udayam
​పశ్చిమ గోదావరి జిల్లా ఉండి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు అండర్-19 కరాటే పోటీలలో ప్రతిభ చాటారు. ఏలూరు, తూర్పు గోదావరి జోన్ స్థాయి పోటీల్లో గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన గీతిక, మహేష్, మహేంద్ర ఈ విజయం సాధించినట్లు HM ఏలూరుపాటి రామలక్ష్మి బుధవారం తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

Comments

G
Loading comments...