వార్తలకు తిరిగి వెళ్లండి

డుంబ్రిగుడ మండలం కొర్రాయి మినీ రిజర్వాయర్‌ను ఎస్‌ఎంఐ డివిజన్ ఈఈ రాజేంద్రకుమార్ శుక్రవారం పరిశీలించారు. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం, నీటి విడుదల వ్యవస్థలను తనిఖీ చేశారు.
రెండు తూముల ద్వారా 114 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోందని తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా నీటి సరఫరాను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల్లో నీటిని సద్వినియోగం చేసుకోవాలని, వృథా చేయవద్దని సూచించారు.
Comments
Loading comments...

