వార్తలకు తిరిగి వెళ్లండి

పసుపు సాగులో ఆధునిక పద్ధతులు, అధిక దిగుబడుల సాధనపై అవగాహన కల్పించేందుకు సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో 40 మంది గిరిజన రైతులు శనివారం కోయంబత్తూరుకు బయలుదేరారు. ఏడు రోజుల పర్యటనలో అక్కడి పసుపు సాగు విధానాలు, పంట సంరక్షణ, ఆధునిక సాంకేతిక పద్ధతులను రైతులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.
పర్యటనను పీవో పవార్ స్వప్నిల్ జెండా ఊపి ప్రారంభించారు. అక్కడ పద్ధతులను స్థానికంగా అమలు చేసి ఆదాయం పెంచుకోవాలన్నారు.
Comments
Loading comments...

