వార్తలకు తిరిగి వెళ్లండి

కోటవురట్ల మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. ఈ పదవులకు పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో జెడ్పీటీసీ స్థానం ఓసీ మహిళలకు, ఎంపీపీ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించారు.
ఈసారి ఎంపీపీ స్థానం ఓసీ జనరల్‌కు, జెడ్పీటీసీ స్థానం బీసీ లేదా ఎస్సీలకు కేటాయించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అయితే, రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Loading comments...

