వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా కోటగిరి ఉమ్మడి మండలంలోని రజక సంఘానికి చెందిన 16 మంది లబ్ధిదారులకు బుధవారం వాషింగ్ మెషిన్లు పంపిణీ చేశారు. కోటగిరి పోస్టాఫీసు సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
పోతంగల్, కోటగిరి, రుద్రారం ప్రాంతాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు యంత్రాలను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

