Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమలో గ్యాస్ బ్లోఅవుట్ కలకలం

Follow Udayam on Google
Shruthi Nov 17, 2026 8:19 AM కోనసీమGeneral
కోనసీమలో గ్యాస్ బ్లోఅవుట్ కలకలం - Udayam
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ బ్లోఅవుట్ సంభవించింది. తాడివారి మెరక ఓఎన్‌జీసీ రీడ్రిల్లింగ్ పాయింట్ నుంచి సీఎన్‌జీ గ్యాస్ లీకై చుట్టుపక్కల గ్రామాలకు విస్తరిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు పరిసర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తూ 216 జాతీయ రహదారి బైపాస్‌పై రాకపోకలను నిలిపివేశారు.

Comments

G
Loading comments...