వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో జరిగిన లారీ-బస్సు ప్రమాద ఘటనపై కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
క్షతగాత్రులకు ఎలాంటి లోటు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని యంత్రాంగాన్ని కోరారు. ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాలు మళ్లీ జరగకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

