వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపురంలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు ఎండలో రోడ్లపైనే గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. రైల్వే స్టేషన్ రోడ్డు బస్ స్టాప్, ఎస్‌బీఐ బస్ స్టాప్‌ల వద్ద నీడ కల్పించే ఏర్పాట్లు లేక వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.
ఎండైనా, వానైనా నడి రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

