వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడ మండలంలో కొద్ది రోజులుగా ఎనిమిది అడవి ఏనుగుల గుంపు తిష్ట వేసి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మండలంలో అంకుల్లవలస పరిసర పొలాలలో సంచరిస్తున్నాయని స్థానిక రైతులు తెలిపారు.
ఏనుగుల సంచారంతో పంటలు నాశనం అవ్వడంతో పాటు పొలం పనులు కూడా చేసుకోలేక పోతున్నామన్నారు. దీంతో వ్యవసాయ సాగులో తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు.
Comments
Loading comments...

