వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్పల్లిలో తన ఇద్దరు కుమారులు, కుమార్తె పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆరపేటకు చెందిన వృద్ధురాలు చౌటుపల్లి సత్తమ్మ సోమవారం ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు.
తన భర్త మృతి తర్వాత ఒంటరిగా జీవిస్తున్నానని, వారసత్వంగా వచ్చిన ఆరు ఎకరాల భూమిని కుమారులు తీసుకున్నప్పటికీ తన బాగోగులు చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుమారులు తన పోషణ బాధ్యత తీసుకునేలా చర్యలు చేపట్టి న్యాయం చేయాలని కోరారు.
Comments
Loading comments...

