Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొబ్బరి చెట్టుకు పిడుగు.. ఒక్కసారిగా మంటలు

Follow Udayam on Google
నిర్మల్ Sep 20, 2026 1:41 PM నిర్మల్General
నిర్మల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ శబ్దంతో పిడుగు పడటంతో సమీపంలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పిడుగు ప్రభావంతో కొబ్బరి చెట్టులో మంటలు వ్యాపించాయి. ఉరుములు, మెరుపుల మధ్య అకస్మాత్తుగా పిడుగు పడటంతో గ్రామస్తులు ఏం జరిగిందో అర్థంకాక ఆందోళనకు గురయ్యారు.

Comments

G
Loading comments...