Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంటి ఆరోగ్యం పై విద్యార్థులకు అవగాహన

Follow Udayam on Google
K. Anuradha Sep 30, 2026 4:37 PM శ్రీకాకుళంGeneral
కంటి ఆరోగ్యం పై విద్యార్థులకు అవగాహన - Udayam
మందస మండలం విజేత హైస్కూల్‌లో జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా బుధవారం విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లా అంధత్వ నివారణ సంఘం, కలెక్టర్ ఆదేశాల మేరకు మందస నేత్ర వైద్య అధికారి రోణంకి వెంకటరమణ 410 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో 35 మందికి దృష్టిలోపం గుర్తించి కళ్లద్దాలకు సిఫార్సు చేశారు. కంటి వ్యాధులు, నేత్ర సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...