Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంపెనీల పేరుతో రైతుల భూములు దోచేస్తున్నారు

Follow Udayam on Google
B. Rajesh Oct 05, 2026 11:19 AM విజయనగరంGeneral
మంత్రి కొండపల్లి శ్రీనివాస్పై గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ గజపతినగరం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా ఎదుట మాట్లాడారు. ఇండస్ట్రీస్ పేరుతో కంపెనీలతో లాలూచీ పడి రైతుల భూములను కారు చౌకగా మంత్రి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Comments

G
Loading comments...