వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల రూరల్ మండలం ఒడ్డెర కాలనీలో దారుణ హత్య జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి రాజయ్య తన కుమారుడు వెంకటేష్ (22) తలపై గొడ్డలితో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన అనంతరం రాజయ్య పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

