Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కందుకూరు హైస్కూల్‌ ముందు ఓపెన్‌ డ్రైనేజీ

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 3:30 PM నెల్లూరుGeneral
కందుకూరు హైస్కూల్‌ ముందు ఓపెన్‌ డ్రైనేజీ - Udayam
కందుకూరులోని జిల్లా పరిషత్‌ బాలుర హైస్కూల్‌ ముందు డ్రైనేజీపై స్లాబ్‌ పూర్తిగా దెబ్బతినడంతో కాలువలు ఓపెన్‌గా ఉన్నాయి. విద్యార్థులు, వాహనదారులు ఏమరపాటుగా ఉంటే గుంతల్లో పడే ప్రమాదం ఉంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో రాత్రి వేళల్లో ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది. మున్సిపల్‌ అధికారులు స్పందించి డ్రైనేజీపై స్లాబ్‌లు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు, వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...