వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్లోని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధి బాబానగర్ ఫంక్షన్ హాల్ సమీపంలో వేగంగా వచ్చిన మహీంద్రా కారు డివైడర్ను ఢీకొట్టి కిందనున్న రోడ్డుపై పడిపోయింది. కారులో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం అనంతరం డ్రైవర్ పరారైనట్లు సమాచారం. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు ప్రాణనష్టం జరిగినట్లు తెలియలేదు. కారు తీవ్రంగా దెబ్బతింది.
Comments
Loading comments...

