Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్యూనిటీ కాంటాక్ట్ లో అదుపులోకి 50 బైక్ లు, ఆటో

Follow Udayam on Google
K. Anjaiah Oct 06, 2026 12:20 PM వికారాబాద్General
కమ్యూనిటీ కాంటాక్ట్ లో అదుపులోకి 50 బైక్ లు, ఆటో  - Udayam
శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, నేరాల నివారణే లక్ష్యంగా వికారాబాద్ పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు విస్తృతంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా స్వయంగా పాల్గొని కాలనీలోని పరిస్థితులను పరిశీలించడంతో పాటు స్థానికులతో మాట్లాడారు. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన తనిఖీలు 8.30 గంటల వరకు కొనసాగాయి.

Comments

G
Loading comments...