వార్తలకు తిరిగి వెళ్లండి

జియ్యమ్మవలస, దుర్గాదేవి ఆలయం సమీపంలోని తాగునీటి బావిలో గుర్తుతెలియని వ్యక్తులు క్రిమిసంహారక మందు కలపడంతో నీరు కలుషితమై నల్లగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి జగన్మోహన్రావు బావిలోని నీటిని మోటార్ ద్వారా తొలగించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Comments
Loading comments...

