Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్తీ పెరుగు, కోవా కేంద్రంపై ఎస్‌ఓటీ పోలీసుల దాడి

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 16, 2026 4:37 PM మేడ్చల్ మల్కాజిగిరితెలంగాణ
కల్తీ పెరుగు, కోవా కేంద్రంపై ఎస్‌ఓటీ పోలీసుల దాడి - Udayam
కాప్రా సర్కిల్‌ పరిధిలోని వైష్ణవి ఎన్‌క్లేవ్‌లో నందిని మిల్క్‌ సెంటర్‌లో కల్తీ పెరుగు, కోవా తయారు చేస్తున్న కేంద్రంపై మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా 120 కిలోల కల్తీ పెరుగు, 6 కిలోల కోవాను తరలిస్తున్న రామచందర్‌ను అదుపులోకి తీసుకుని, టాటా ఏస్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో సుమారు 1,000 కిలోల పెరుగు, 50 కిలోల కోవా నిల్వ ఉన్నట్లు గుర్తించారు.

Comments

G
Loading comments...