వార్తలకు తిరిగి వెళ్లండి
హయత్‌నగర్‌లో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ యూనిట్‌పై M-FAST, SOT ఎల్బీనగర్, హయత్‌నగర్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారు చేస్తున్నట్లు అనుమానిస్తున్న సుమారు 730 కిలోల పేస్ట్‌ను అధికారులు సీజ్ చేశారు.
అలాగే గుర్తుతెలియని ద్రావణం, ఫుడ్ కలర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఒకరిని అదుపులోకి తీసుకుని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

