వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికల తొలి రౌండ్‌లో టీడీపీ నాలుగు వార్డులను కైవసం చేసుకుంది. 1, 10, 11, 16 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పటికే 12వ వార్డు ఏకగ్రీవం కావడంతో ఆ పార్టీ ఖాతాలో మొత్తం 5 స్థానాలు చేరాయి.
తొలి రౌండ్‌లోనే నాలుగు వార్డులు గెలవడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రెండో రౌండ్‌లో 17 నుంచి 31 వార్డుల ఫలితాలు వెలువడాల్సి ఉంది.
Comments
Loading comments...

