Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరు పెద్ద చెరువు అలుగు ఉద్ధృతి

Follow Udayam on Google
K. Venkatesh Sep 25, 2026 5:19 PM ఖమ్మంతెలంగాణ
కల్లూరు పెద్ద చెరువు అలుగు ఉద్ధృతి - Udayam
ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండిపోయి అలుగులు పారుతున్నాయి. పెద్ద చెరువు అలుగు ఉద్ధృతి పెరగడంతో శుక్రవారం ఉదయం రాకపోకలను నిలిపివేశారు. రాళ్లబంజర, బోడిమల్లె గ్రామాలకు వెళ్లే మార్గంలో వాహనాలను అడ్డుగా ఉంచి రాకపోకలు నియంత్రించారు. ఉద్ధృతి తగ్గే వరకు ప్రయాణించవద్దని అధికారులు హెచ్చరించారు. అయినా కొందరు అలుగు దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...