Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరు CHC సూపరింటెండెంట్‌పై వేటు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 10:51 AM ఖమ్మంGeneral
కల్లూరు CHC సూపరింటెండెంట్‌పై వేటు - Udayam
కల్లూరు CHC సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బానోత్‌ రమేష్‌ను బాధ్యతల నుంచి తొలగిస్తూ అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీజ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆసుపత్రి నిర్వహణ, విధులకు గైర్హాజరుపై ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రి ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను MD రంజిత్‌కు అప్పగించారు. సోమవారం DCHS రాజశేఖర్‌ ఆసుపత్రిని తనిఖీ చేసి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

Comments

G
Loading comments...