వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలి మండలం కలచట్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు.
కాలనీ చుట్టూ మూడు బోర్లు ఉన్నప్పటికీ వాటిని వినియోగంలోకి తీసుకువచ్చి నీటి సరఫరా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. సమస్యను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

