వార్తలకు తిరిగి వెళ్లండి

మలికిపురం మండలంలోని లక్కవరం-మట్టపర్రు రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్కవరం నుంచి రాజోలు వైపు వెళ్లే వాహనాలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని స్థానికులు తెలిపారు.
చిన్నపాటి వర్షానికే గుంతల్లో నీరు చేరి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో ఈ రహదారిపై రాకపోకలు సాహసంగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

