Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం

Follow Udayam on Google
K.Venkatesh Aug 25, 2026 1:53 PM ఖమ్మంGeneral
ఖమ్మం ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం - Udayam
ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో రూ.23.75 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ప్రారంభించనున్నారు. ప్రమాద బాధితులకు సత్వర చికిత్స, అత్యవసర వైద్యం అందించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. ICU, రెండు ఆపరేషన్ థియేటర్లు, డయాలసిస్, ఐసోలేషన్, ఎమర్జెన్సీ పడకలు, ల్యాబ్, ఆక్సిజన్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. నిపుణులైన వైద్యులు సేవలు అందించనున్నారు. అత్యాధునిక వైద్యం లభించనుంది.

Comments

G
Loading comments...