Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం తీగల వంతెనపై తారురోడ్డు పనులు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 12:24 PM ఖమ్మంGeneral
ఖమ్మం తీగల వంతెనపై తారురోడ్డు పనులు - Udayam
ఖమ్మం కాల్వఒడ్డు వద్ద మున్నేరుపై రూ.180 కోట్ల అంచనాలతో నిర్మిస్తున్న తీగల వంతెనపై తారురోడ్డు పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు నిర్మాణానికి అవసరమైన పనులను ఆర్అండ్‌బీ అధికారులు గత వారం రోజులుగా చేపడుతున్నారు. ప్రస్తుతం వంతెనపై తారు వేసే పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...