Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే శ్రీగణేష్

Follow Udayam on Google
G. Sathish Sep 24, 2026 9:20 AM హైదరాబాద్General
ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే శ్రీగణేష్ - Udayam
గణేష్‌ చతుర్థి నవరాత్రుల సందర్భంగా పదో రోజు రాత్రి కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శ్రీగణేష్‌ కుటుంబ సమేతంగా ఖైరతాబాద్‌ మహాగణపతి మండపాన్ని సందర్శించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు, భక్తులతో ఎమ్మెల్యే ఆత్మీయంగా ముచ్చటించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...