వార్తలకు తిరిగి వెళ్లండి

పస్రా గ్రామపంచాయతీ పరిధిలోని రాంపూర్ 11వ వార్డులో పారిశుధ్యం అధ్వానంగా మారింది. ఖాళీ ఇంటి స్థలాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. దుర్వాసన, దోమలు, ఈగల బెడదతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాలకు నీరు నిలిచే అవకాశం ఉండటంతో వ్యాధుల భయం నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి ఖాళీ స్థలాలను శుభ్రం చేసి, క్రమం తప్పకుండా పారిశుధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

