వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపేట మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ గురువారం ప్రారంభమైంది. సచివాలయ సిబ్బంది ఉదయాన్నే గ్రామాలకు చేరుకుని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పంపిణీ ప్రక్రియ నెమ్మదిగా సాగింది. ఇటీవల పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు కూడా కేంద్రాలకు చేరుకుని తమకు పింఛన్ మంజూరవుతుందనే ఆశతో ఎదురుచూశారు.
Comments
Loading comments...

