వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపేట మండలం పుల్లూరు పంచాయతీల పరిధిలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. రెండు రోజులకు ఒకసారి సాయంత్రం వేళల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని వారు తెలిపారు. సర్వర్‌ఖాన్‌పేట, కోటం గురువాయపల్లె ప్రాంతాల్లో చిరు వ్యాపారులు, దుకాణదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఏడాదిగా ఇదే సమస్య ఉందని వారు తెలిపారు.
Comments
Loading comments...

