వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీన్‌కార్డ్ దరఖాస్తు ప్రక్రియ సమయంలో వలసదారులు అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన నోటీసు గందరగోళానికి దారితీయడంతో ఈ వివరణ ఇచ్చింది. దరఖాస్తుదారులు యూఎస్‌లోనే ఉంటూ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని పేర్కొంది.
అయితే, దరఖాస్తుదారుడు స్వదేశానికి వెళ్లాలా లేదా అనేది ఇమిగ్రేషన్ అధికారుల విచక్షణాధికారాలపైనే ఆధారపడి ఉంటుందని తెలిపింది. వీసా గడువు ముగిసిన వారిపై చర్యలు ఉంటాయని పేర్కొన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లాలో స్పష్టత ఇవ్వకపోవడంతో వలసదారుల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.
Comments
Loading comments...

