వార్తలకు తిరిగి వెళ్లండి

అసమానతల నిర్మూలనతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య అన్నారు. తాండూరు బాలుర కళాశాల హాస్టల్లో "80 ఏళ్ల స్వాతంత్య్రం - సామాజిక న్యాయం" అంశంపై జిల్లా స్థాయి సెమినార్ నిర్వహించారు.
దేశంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని, ప్రజాస్వామ్య రక్షణకు యువత పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బుగ్గప్ప, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

