Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేషరంలో అటవీశాఖ తనిఖీలు.. చెట్ల నరికివేత గుర్తింపు

Follow Udayam on Google
R.R. Reddy Oct 05, 2026 3:24 PM నిజామాబాద్General
కేషరంలో అటవీశాఖ తనిఖీలు.. చెట్ల నరికివేత గుర్తింపు - Udayam
కేషరం గ్రామంలోని ఓ వ్యవసాయ పొలంలో అక్రమంగా చెట్లు నరికిన ఘటనను అటవీశాఖ అధికారులు గుర్తించారు. సోమవారం అన్సాన్‌పల్లి బీట్ పరిధిలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బి.మానస, బీట్ ఆఫీసర్ సీహెచ్ నవీన్ రాజ్ తనిఖీలు నిర్వహించారు. సాయన్న పొలం వద్ద 12 చెట్ల వాసాలు నరికినట్లు గుర్తించి అటవీ చట్టాల ప్రకారం రూ.9,980 కాంపౌండింగ్ రుసుము విధించారు. అనుమతులు లేకుండా చెట్లను నరికితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...