వార్తలకు తిరిగి వెళ్లండి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక రిటైర్మెంట్ తీసుకోవడం ఖాయమని, అందుకే ఆయన ఫాంహౌస్ దాటి బయటకు రావడం లేదని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ... సిరిసిల్లలో కాంగ్రెస్ సభ విజయవంతం కావడంతో ఓర్వలేక పోతున్నారన్నారు. బీఆర్ఎస్ నేతల భూదోపిడిపై త్వరలోనే పూర్తి ఆధారాలు బయటపెడతామని, ముందున్నది మొసళ్ల పండుగ అంటూ బీఆర్ఎస్ నాయకులను ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...

