వార్తలకు తిరిగి వెళ్లండి

కేశంపేట మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రజక సంఘం అధ్యక్షుడు వి రాములు ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం దొరల అరాచకాలను ఎదిరించిన ఆమె పోరాట స్ఫూర్తిని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవిచంద్ర రెడ్డి, సర్పంచ్ బొజ్జం సంతోష్, ఎస్‌ఐ పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

