కేఎల్ రాహుల్ అద్భుత శతకం

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 207 బంతుల్లో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెరీర్‌లో ఇది అతడికి 13వ టెస్టు శతకం. మరోవైపు దేవదత్ పడిక్కల్ 66 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
74 ఓవర్లకు భారత్ ఒక వికెట్ నష్టానికి 265 పరుగులు చేసింది. రెండో వికెట్‌కు రాహుల్, పడిక్కల్ 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
Comments
Loading comments...
