Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌట్ల(కె) పంట పొలంలో కొండచిలువ హల్ చల్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Oct 05, 2026 11:28 AM నిర్మల్General
నిర్మల్ రూరల్ మండలంలోని కౌట్ల (కె) లో నది మార్గంలో ఉన్న పొలంలో భారీ కొండచిలువ సంచరిస్తోందని గుర్తించిన గ్రామస్తులు సోమవారం ఉదయం దానిని చంపివేశారు. నిమ్మ నర్సయ్య పంట పొలంలో ఉన్న కొండచిలువను గుర్తించి స్థానికులకు సమాచారం అందించాడు. ఇప్పటికే ఆ పరిసరాలలో మేక పిల్లలు కనిపించకపోతుండటంతో ఆందోళనలో ఉన్న గ్రామస్తులు ఒకేసారి కొండచిలువను చూసి భయాందోళనలకు గురయ్యారు. కర్రల సాయంతో దానిని హతమార్చారు.

Comments

G
Loading comments...