Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలో కావేరీ నిరసనల కలవరం..

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 31, 2026 2:32 PM జాతీయంGeneral
కర్ణాటకలో కావేరీ నిరసనల కలవరం.. - Udayam
తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటకలో బీజేపీ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మండ్యలో నిరసన తెలుపుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్రతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర జలసంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడుకు నీరు విడుదల చేస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ కృష్ణరాజసాగర్ డ్యామ్ వద్ద బీజేపీ భారీ నిరసనకు దిగింది.

Comments

G
Loading comments...