వార్తలకు తిరిగి వెళ్లండి

వాతావరణంలో మార్పుల నేపథ్యంలో జ్వరం, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలతో కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రోగులు భారీగా వస్తున్నారు. ఈ నెల 1 నుంచి 17 వరకు 16,411 మంది ఓపీ నమోదు చేసుకున్నారు.
రోజూ వెయ్యికిపైగా ఓపీ నమోదు కావడంతో మందుల కేంద్రం వద్ద రద్దీ పెరిగింది. వృద్ధులు, దివ్యాంగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఇబ్బందుల పరిష్కారానికి అదనపు సిబ్బందిని నియమిస్తామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...

