వార్తలకు తిరిగి వెళ్లండి
కండ్లకొయ్యలో ఘోర ప్రమాదం

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకొయ్య ఓఆర్ఆర్ అండర్‌బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న సొహైల్, సుమిత్‌లను ఓ గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది.
సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...