వార్తలకు తిరిగి వెళ్లండి

కాటన్ చీరల తయారీ కార్మికులు, ఆసాముల కూలి పెంచాలని డిమాండ్ చేస్తూ CITU ఆధ్వర్యంలో సోమవారం నుంచి నిరవధిక సమ్మె ప్రారంభమైంది. నెహ్రునగర్‌లో కార్మికులు, ఆసాములు సమ్మెను ప్రకటించారు.
CITU పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మాట్లాడుతూ కూలి ఒప్పందం ముగిసి 30 నెలలు గడిచినా యజమానులు కూలి పెంచలేదన్నారు. కార్మికులకు ఒక్క చీరకు రూ.100, ఆసాములకు రూ.150 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

