Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాటేసిన పాముతో ఆసుపత్రికి

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 10, 2026 7:19 AM జాతీయంGeneral
కాటేసిన పాముతో ఆసుపత్రికి - Udayam
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాకు చెందిన స్నేక్‌ క్యాచర్‌ దేవ్‌జిత్‌ సర్కార్‌ తనను కాటేసిన పామును మెడకు చుట్టుకుని బైక్‌పై 14 కిలోమీటర్లు ప్రయాణించి ఆసుపత్రికి చేరుకున్నాడు. పాము విషపూరితమా కాదా తెలుసుకునేందుకు దానిని వెంట తీసుకెళ్లాడు. పామును పరిశీలించిన వైద్యులు అది విషపూరితం కాదని నిర్ధారించారు. దేవ్‌జిత్‌కు చికిత్స అందించగా త్వరగా కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించారు.

Comments

G
Loading comments...