వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నందం కోరారు. ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు.
ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించడంతో పాటు కార్మికులకు కనీస వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి రామచందర్ తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

